హైదరాబాద్: డ్రగ్స్ కేసులో పక్కా సమాచారంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ డీపీపీ లింబారెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ నైజీరియాకు చెందిన జాన్ బాస్కో, కాకినాడకు చెందిన మహ్మమద్ జవహర్‌లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 180 గ్రాములు కొకైన్, నాలుగు సెల్ఫోన్సఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
బిజినెస్‌వీసాపై ఇండియాకు వచ్చిన జాన్‌బాస్కో డ్రగ్స్ దందాకు తెరలేపాడని ఆయన తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మహహ్మదుల్లాతో పరిచయం పెంచుకొని డ్రగ్స్ అమ్మకాలు చేశారని చెప్పారు. ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు విచరణలో వెల్లడైందని పేర్కొన్నారు. నిందితుల కాల్ లిస్ట్ ఆదారంగా సినీ ఇండస్ట్రీకి చెందిన లింకులు, ఐటీ లింకులపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిపైనా పీడీ యాక్టు పెడుతున్నామని, దర్యాప్తు నిమిత్తం ఇద్దరు నిందితలును ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు.
డ్రగ్స్‌కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
Published Sun, Aug 6 2017 5:00 PM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM
Advertisement
Advertisement