
డ్రగ్స్ ముఠా అరెస్టు
హైదరాబాద్: మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ముఠాను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. కోల్‌కతా నుంచి అక్రమంగా మత్తు పదార్థాలను తరలించి, నగరంలో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు కిలోల ఓపియం(నల్లమందు)ను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.