నగరంలో డ్రగ్స్ ముఠా అరెస్ట్
Published Mon, Jan 30 2017 2:40 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియన్ల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 370 గ్రాముల కొకైన్‌తో పాటు రూ. 46 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ఇద్దరు నైజీరియన్లతో పాటు మరో నలుగురు సభ్యులు ఉన్నారు. వీరితో సంబంధాలు ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement