రాష్ట్రంలో విద్యా శాఖ పరిధిలోని గురుకుల విద్యాలయాల్లో 302 లెక్చరర్, టీచర్ల ఖాళీలున్నాయి.
భర్తీ కోసం ప్రభుత్వానికి విద్యా శాఖ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా శాఖ పరిధిలోని గురుకుల విద్యాలయాల్లో 302 లెక్చరర్, టీచర్ల ఖాళీలున్నాయి. ఆయా పోస్టులను డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా కింద భర్తీకి అనుమతివ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రంలోని 47 గురుకుల విద్యాలయాల్లో 802 మంజూరైన టీచర్ పోస్టులుండగా, అందులో 492 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 179 పోస్టుల్లో సీఆర్‌టీలు పని చేస్తున్నారు. డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాలో 302 ఖాళీలున్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది.
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు..
కేటగిరీ మంజూరైనవి ఖాళీలు భర్తీ చేయాల్సినవి
జూనియర్ లెక్చరర్ 66 10 6
పీజీటీ 361 149 136
టీజీటీ 247 224 74
పీఈటీ 41 32 22
ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్ 46 43 32
స్టాఫ్ నర్స్ 41 34 32
మొత్తం 802 492 302