హైదరాబాద్ జూపార్క్లో విషాదం
హైదరాబాద్: నెహ్రూ జూపార్క్లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకుంటూ ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్కు గురయ్యాడు. పురానాఫూల్కు చెందిన ముంజిత్ కుమార్ అనే టెన్త్ విద్యార్థి నెహ్రూ జూ పార్క్కు విహార యాత్రకు వచ్చాడు. బట్టర్ఫ్లై పార్క్లోకి వెళ్లిన సమయంలో సెల్ఫీ దిగుతుండగా ప్రమాదశాత్తూ అతడికి కరెంటు తీగలు తగిలి షాక్ తగిలింది.
విద్యుత్ షాక్ కారణంగా తీవ్రగాయాలపాలైన విద్యార్థి ముంజిత్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే మార్గం మధ్యలో అతడు మృతిచెందినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.