'జోనల్ వ్యవస్థను తీసిపారేయండి' | abolish jonal system: ts employees | Sakshi
Sakshi News home page

'జోనల్ వ్యవస్థను తీసిపారేయండి'

Published Thu, Aug 18 2016 1:56 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

abolish jonal system: ts employees

హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలలో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ భేటీ ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి టీచర్ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవీ ప్రసాద్, రవీందర్ రెడ్డి, మమత అన్నారు.

గందరగోళానికి కారణమవుతున్న జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న జోనల్ పోస్టులను రాష్ట్ర, జిల్లా స్థాయిలుగా విభజించాలని కోరారు. కొత్త రిక్రూట్ మెంట్ జిల్లా స్థాయిలో జరగాలని, అలాట్ మెంట్ రాష్ట్ర స్థాయిలో ఉండాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement