
సాక్షి, హైదరాబాద్: జోనల్ వ్యవస్థపై లోతుగా అధ్యయనం చేయడానికి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయా లని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ఆగమేఘాలమీద ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు. ప్రస్తుత జోనల్ వ్యవస్థపై భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తడానికి వీలుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment