
మద్యం మత్తులో యాసిడ్ తాగి...
మహిళ మృతి
జియాగూడ: మద్యం మత్తులో ఓ గృహిణి టాయిలెంట్ క్లీనింగ్ యాసిడ్ తాగి చికిత్సపొందుతూ మృతి చెందిన సంఘటన టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరి«ధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం... కార్వాన్ జాఫర్‌గూడకు చెందిన శోభ (42) ఆదివారం సాయంత్రం కల్లు తాగి ఇంటికి వచ్చింది.
అనంతరం బాత్‌రూంకు వెళ్లి మద్యం మత్తులో అక్కడ ఉన్న టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ తాగింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను కుటుంబ సభ్యులు గుడిమల్కాపూర్‌లోని ధరణి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విమషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.