
వ్యవసాయాధికారులకూ భాగస్వామ్యం
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో వ్యవసాయాధికారులను భాగస్వామ్యం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వ సీఎస్ ఎస్.పి.సింగ్ ఆదేశించారు.
ఈ నేపథ్యంలోనే సీఎస్ ఈ ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. సమగ్ర సర్వేలో వ్యవసాయ భూముల వివరాలను ఇప్పటికే 90 శాతం వరకు సేకరించినందున ఏఈవోల సహకారం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. 1బీ రికార్డులు, రైతు సమగ్ర సర్వే సమాచారాన్ని కలిపి సరిచూసుకొని డిసెంబర్ నాటికి తుది భూరికార్డులను తయారు చేయాల్సి ఉందన్నారు. ఆ సమా చారం ఆధారంగానే రైతుల వ్యవసాయ భూముల వివరాలు తయారుచేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఎకరానికి రూ.4 వేలు పెట్టుబడి ఇచ్చే పథకాన్ని ప్రారంభించాల్సి ఉందన్నారు. సీఎస్ ఆదేశాల నేపథ్యంలో ఏఈవోలంతా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో పాలు పంచుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి ఆదివారం ఆదేశించారు. సమగ్ర సర్వేలో రైతుకు సంబంధించిన సమగ్ర సమా చారం ఇప్పటికే సేకరించామన్నారు.