హైదరాబాద్ : హైదరాబాద్లో మరో సాప్ట్వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి చివరకు ప్లేటు ఫిరాయించింది. హిమాయత్ నగర్లోని హెచ్ఆర్ఈ సొల్యూషన్స్ ... ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగులు ఇప్పిస్తామంటూ పలువురు నుంచి డబ్బులు వసూలు చేసింది. ఆ తర్వాత ఉద్యోగం గురించి అడిగితే ...రేపు మాపు అంటూ తిప్పించుకోవటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
బోర్డు తిప్పేసిన హెచ్ఆర్ఈ సొల్యూషన్స్
Published Tue, May 27 2014 12:57 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement