
పురందేశ్వరికి టికెట్ ఇవ్వొద్దని టీడీపీ షరతు?
రానున్న ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తుపై చర్చ గురువారం దాదాపు కొలిక్కి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో 50 మంది ఎమ్మెల్యేలు,8 ఎంపీ స్థానాలు,సీమాంధ్ర ప్రాంతంలో 22 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది.
అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరీకి లోక్సభ టిక్కెట్ ఇవ్వదంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పెట్టిన షరతుకు బీజేపీ అంగీకరించింది. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఆయనతో పొత్తులపై మరోసారి చర్చించి, ఇరు పార్టీల మధ్య కుదిరన పొత్తును అధికారికంగా ప్రకటించనున్నారు.