రాజ్భవన్లో తేనేటి విందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గైర్హాజరవడంపై గవర్నర్ నరసింహన్ సరదాగా స్పందించారు.
హైదరాబాద్: రాజ్భవన్లో తేనేటి విందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గైర్హాజరవడంపై గవర్నర్ నరసింహన్ సరదాగా స్పందించారు. గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) సందర్భంగా మంగళవారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ తేనేటి విందును ఏర్పాటు చేశారు. ఈ తేనేటి విందుకు చంద్రబాబు, కేసీఆర్ హాజరుకాలేదు. వివిధ పార్టీల నేతలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విందుకు హాజరయ్యారు.
అయితే ఇరు రాష్ట్రాల సీఎంలు రాకపోవడానికి కారణాలు తెలియదని ఆయన అన్నారు. ఇద్దరు సీఎంలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని నరసింహన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు గవర్నర్ తేనేటి విందుకు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది.