ముందు చూపుతో మందు కొంటే..ప్రాణం తీసిన సిసా | bottle taken with the show in front of the drug kontepranam | Sakshi
Sakshi News home page

ముందు చూపుతో మందు కొంటే..ప్రాణం తీసిన సిసా

Published Sun, May 17 2015 1:50 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

జేబులోని మద్యం సీసా పగిలి వ్యక్తి మర్మాంగాలకు గాయాలు కావడంతో, చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన

జీడిమెట్ల: జేబులోని మద్యం సీసా పగిలి వ్యక్తి మర్మాంగాలకు గాయాలు కావడంతో,  చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట సోమయ్యనగర్‌కు చెందిన మల్లేశ్(26) మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం జగద్గిరిగుట్టలోని ఓ మద్యం దుకాణంలో మద్యం సేవించిన మల్లేశ్ మరో సీసా కొనుగోలు చేసి ప్యాంట్ ముందు జేబులో పెట్టుకున్నాడు.

నడుచుకుంటూ వెళ్తుండగా వర్షం రావడంతో పరుగుతీశాడు. ఈ క్రమంలో మల్లేశ్ కింద పడడంతో జేబులో ఉన్న సీసా పగిలి మర్మాంగాలకు గుచ్చుకుంది. తీవ్రరక్తస్రావం కావడంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు.  అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement