మైనారిటీ నిండని బాలికకు తల్లిదండ్రులు తలపెట్టిన వివాహ కార్యక్రమాన్ని బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే..తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టలోని నివసించే కొడారి శంకర్, ఇందిర దంపతుల కుమార్తె (16)కు బొల్లారం ప్రాంతానికి చెందిన శ్రీనివాసుతో వివాహం నిశ్చయమైంది.
ఈ నెల21వ తేదీన యాదగిరిగుట్టలో పెళ్లి చేయనున్నారని విషయం బాలలహక్కుల సంఘానికి తెలిసింది. దీంతో సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి వివాహాన్ని రద్దు చేయించారు. బాలికను బాలికల వసతి గృహానికి తరలించేందుకు యత్నించగా తల్లి అడ్డుకుంది. ఆమెను తనకే ఇవ్వాలని కోరింది. అయితే, పోలీసుల సాయంతో బాలల హక్కుల సంఘం ప్రతినిధులు బాలికను హాస్టల్‌కు తీసుకెళ్లి, చేర్పించారు.