సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంగీకరించినట్లు టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. గ్రూప్2 కొత ్త సిలబస్‌కు తగ్గ పుస్తకాలు లభ్యం కాకపోవడంతో పరీక్షలను 2 నెలలు వాయిదా వేసేందుకు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డితో కలసి ఈ విషయంపై సీఎంతో చర్చించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వచ్చేనెల 3న ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉన్నందున అదే రోజు జరగనున్న పోలీస్ కానిస్టేబుల్ పరీక్షను వాయిదా వేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారని వివరించారు. ఎస్‌ఐ పరీక్షకు ఇంగ్లిష్ పేపర్ మార్కులను అర్హత పేపర్‌గానే పరిగణిం చాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నిరుద్యోగుల డిమాండ్లపై స్పందించి తగు చర్యలు తీసుకున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు.
‘గ్రూప్2 పోస్టుల పెంపునకు సీఎం అంగీకారం’
Published Sun, Mar 27 2016 4:54 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement