
త్వరలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధుల సమీకరణే లక్ష్యంగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరారు.
కేసీఆర్ ముందుగా హైదరాబాద్ నుంచి ఇండోర్ వెళ్లతారు. ఆధునిక ఇరిగేషన్ పద్ధతులపై కేసీఆర్ మధ్యప్రదేశ్ సర్కార్తో చర్చలు జరిపిన అనంతరం.. అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉంది.