
మంత్రి సంతకం ఫోర్జరీపై దర్యాప్తుకు కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ సంతకం ఫోర్జరీ చేసినట్టు వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించారు. ఈ కథనాలపై ఆయన సోమవారం విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చందూలాల్ పేషీలో ఒకరిని, ఎస్టీ సంక్షేమ శాఖ సెక్రటరీ పేషీ నుంచి మరొకరిని అరెస్టు చేసినట్టు సమాచారం.
గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పేరిట ఫోర్జరీ లేఖలు గత ఏడాదికాలంగా వెలువడుతున్నట్టు ఇటీవల కథనాలు వచ్చాయి. ఆయన సంతకాలను ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడుతున్నట్టు, కీలకమైన ఫైళ్లు, లేఖలపై మంత్రిగారి షాడో ఒకరు ఫోర్జరీ సంతకాలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలుస్తోంది.