
జైపాల్‌పై వ్యాఖ్యలు సరికాదు: మల్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని ఒప్పించిందే అప్పటి కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ జైపాల్ రెడ్డిపై టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో జైపాల్ రెడ్డి చేసిన కృషిపై అవగాహన లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
పార్లమెంట్‌కు రాకుండా ఫాంహౌజ్‌కే పరిమితమైన కేసీఆర్‌తో తెలంగాణ రాలేదని రవి అన్నారు. పార్టీలో ఉన్న నేతలంతా క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. దీనికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా అతీతుడు కాదన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు తప్పు అని, ఇలా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. నంది ఎల్లయ్యపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.