ఉభయ రాష్ట్రాల్లో ఉన్న సినిమా హాళ్లలో టికెట్ ధరలను నిర్ణయించేం దుకు హోంశాఖ ముఖ్యకార్యదర్శుల అధ్యక్ష తన కమిటీలను ఏర్పాటు చేయాలని
ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో ఉన్న సినిమా హాళ్లలో టికెట్ ధరలను నిర్ణయించేందుకు హోంశాఖ ముఖ్యకార్యదర్శుల అధ్యక్ష తన కమిటీలను ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. టికెట్ ధరలను నిర్ణయించేటప్పుడు ప్రేక్షకుల ప్రయోజనాలతో పాటు ఎగ్జిబిట ర్లు, పంపిణీదారుల ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకోవాలంది. ఇందుకు 2017 మార్చి 31 లోపు తగిన మార్గదర్శకాలను రూపొందించాలని కమిటీలకు సూచించింది. కమిటీల్లో సభ్యులుగా ఎవరు ఉండాలన్నది ముఖ్యకార్యదర్శులు నిర్ణయించుకుంటారంది. కమిటీలు నిర్ణయం తీసుకునేంత వరకు నిర్వహణ వ్యయాల ఆధారంగా టికెట్ ధరల ను నిర్ణయించుకోవచ్చునని థియేటర్లకు తెలిపింది. అయితే టికెట్ ధరల గురించి సంబంధిత అధికారులకు తెలియచేయాలంది.
ఇదే సమయంలో టికెట్ ధరలను సవరిస్తూ 2013 ఏప్రిల్ 26న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 100ను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఇటీవల తీర్పునిచ్చారు. జీవో 100ను సవాలు చేస్తూ ఉభయ రాష్ట్రాల్లోని పలు థియేటర్ల యాజ మాన్యలు 2014లో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై తుది విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఇటీవల ఈ తీర్పు వెలువరించారు. ప్రస్తుతం థియేటర్ల రూపు రేఖలు మారాయని, సాధారణ థియేటర్ల నుంచి మల్టీఫ్లెక్స్‌లుగా రూ పాంతరం చెందాయని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో థియేటర్ల నిర్వహణ వ్యయాల్లోనూ భారీ మార్పులు వచ్చిన క్రమంలో పాత జీవో అమలులో ఉండటం సరికాదని, మారిన పరిస్థితులకు అనుగుణంగా టికెట్ల ధరలు కూడా మారాల్సి న అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు తరువాత తాజాగా మరికొన్ని థియేట ర్లు పిటిషన్లు వేశాయి. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్ విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే జస్టిస్ ఇలంగో తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలకు కూడా అదే తీర్పు వర్తిస్తుందన్నారు.