ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సోమవారం శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేసిన ఓ ప్రయత్నం బెడిసికొట్టింది.
హర్షంతో బల్లలు చరిచిన అధికారపక్ష సభ్యులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సోమవారం శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేసిన ఓ ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రభుత్వ ఆసుపత్రులు నాసిరకంగా ఉన్నాయని విమర్శించే క్రమంలో చింతల మాట్లాడుతూ గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం ఓ ఎస్సీ బాలిక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా రూ. 35 లక్షలు ఖర్చు అవుతుందని తేల్చారన్నారు.
అయితే ఆ బాలికను సీఎం వద్దకు తీసుకెళ్లగా ప్రభుత్వపరంగా ఆ ఖర్చు భరించేలా సాయం చే సేందుకు హామీ ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. సీఎం ఉదారతను ప్రశంసించేలా పరిస్థితి మారటంతో అధికారపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు బాగుంటే పేదలపై ఆర్థిక భారం పడేది కాదని చింతల చెప్పాలనుకున్నారు.