బొమ్మాళి నేనైతే...పశుపతి కేసీఆరా ?
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం దీక్ష విరమించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ...తనను బొమ్మాళి అని కామెంట్ చేసిన కవిత పశుపతి ఎవరో చెప్పాలన్నారు. పశుపతి మీ నాన్న కేసీఆరా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగాలని అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జిల్లాలను ఏర్పాటు చేస్తోందన్నారు.
నేతలు పొన్నాల లక్మయ్య, డీకే అరుణ, సంపత్ కుమార్ లకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించడం లేదని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. జనగామ, గద్వాలను జిల్లా కేంద్రాలుగా చేయాల్సిందేనని...లేకుంటే న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక జిల్లాల ఏర్పాటు కోసం ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ నేతలు దీక్ష చేసిన విషయం తెలిసిందే.