పౌర హక్కుల్ని కాలరాస్తున్నారని హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా, కిర్లంపూడిలో కాపునేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష సందర్భంగా పోలీసులు రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారని, వారిని నియంత్రించాలంటూ సుప్రీం కోర్టు న్యాయవాది, అఖిల భారత కాపు జాగృతి కన్వీనర్ గల్లా సతీశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని శనివారం న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ విచారించారు.
దీక్ష సమయంలో ముద్రగడకు సంఘీభావం తెలి పేందుకు వెళ్లే కాపు నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారని పిటిషనర్ వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై ఏపీ ప్రభుత్వ న్యాయవాది వివరణ కోరారు. దీక్ష చేస్తున్న ముద్రగడ దంపతులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని, ఇప్పుడు కిర్లంపూడిలో ఎవ్వరినీ పోలీసులు అడ్డుకోవడం లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
పోలీసులను నియంత్రించండి
Published Sun, Jun 12 2016 1:50 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement