'రాష్ట్రంలో హెల్త్ ఎమెర్జన్సీ ప్రకటించాలి'
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలకు గురైన వేలాదిమంది ప్రజలు చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలు నివసించే ప్రాంతాల్లో ప్రత్యేక చికిత్స నిమిత్తం వెంటనే హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని కోరుతూ.. ఆయన ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రోగుల సంఖ్య విపరీతంగా పెరగడం వలన ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ సరిపోక ఆదివాసీలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేదలు కూడా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు.