పదో తరగతి విద్యార్థులను హాల్ టికెట్ల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు వేధించడాన్ని అరికట్టాలని, వాటిని ప్రభుత్వం నియంత్రించాలని సీపీఎం డిమాండ్ చేసింది.
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులను హాల్ టికెట్ల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు వేధించడాన్ని అరికట్టాలని, వాటిని ప్రభుత్వం నియంత్రించాలని సీపీఎం డిమాండ్ చేసింది. వారం రోజుల్లో పదో తరగతి పరీక్షలు మొదలుకానుండగా, ప్రైవేట్ సంస్థలు హాల్ టికెట్ల జారీ పేరుతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించింది.
పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఆందోళనకు గురిచేయకుండా షరతులు లేకుం డా హాల్ టికెట్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటీవల ప్రారంభమైన ఇంటర్ పరీక్షల సందర్భంగా కూడా హాల్ టికెట్ల జారీలో విద్యార్థులను ప్రైవేట్ విద్యాసంస్థలు వేధించాయని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందని ధ్వజమెత్తింది.