నన్నెవరూ ఆపలేరు..! | Cyber Crime police to complain townsman | Sakshi
Sakshi News home page

నన్నెవరూ ఆపలేరు..!

Published Tue, Mar 7 2017 3:49 AM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

నన్నెవరూ ఆపలేరు..! - Sakshi

నన్నెవరూ ఆపలేరు..!

ఒకటి బ్లాక్‌ చేస్తే పదులు క్రియేట్‌ చేస్తా!
ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ సైబర్‌ నేరగాడి సవాల్‌
దేవుళ్లను కించపరుస్తూ ఫొటోలతో పోస్టులు
సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు నగరవాసి ఫిర్యాదు


 సిటీబ్యూరో: సోషల్‌మీడియా యాప్‌ ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా ఓ సైబర్‌ నేరగాడు సవాల్‌ విసురుతున్నాడు. అనేక మంది దేవుళ్లను కించపరుస్తూ ఫొటోలను పోస్ట్‌ చేస్తున్న ఇతగాడు ఒక ఐడీని బ్లాక్‌ చేయిస్తే పది సృష్టిస్తానంటూ ఆన్‌లైన్‌లో ప్రకటిస్తున్నాడు. దీనిపై నగరవాసి ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్ట్రాగామ్‌లో ఉన్న అభ్యంతరకర పోస్టింగ్స్‌ను అబిడ్స్‌ ప్రాంతానికి చెందిన వ్యాపారి శనివారం రాత్రి గుర్తించారు. వాటిని పోస్ట్‌ చేసిన వ్యక్తిని సంప్రదించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఓ వర్గాన్ని కించపరుస్తూ ప్రచారం చేస్తున్న వీటిని తొలగించాల్సిందిగా కోరుతూ ఇన్‌స్ట్రాగామ్‌ యాజమాన్యాన్ని ఆశ్రయించారు. తక్షణం స్పందించిన వారు సదరు అభ్యంతరకర పోస్టుల్ని చేస్తున్న ఐడీని బ్లాక్‌ చేశారు. మార్ఫింగ్‌ చేసిన ఆయా ఫొటోలను సైతం తీసేశారు. దీనిపై నగర వ్యాపారి సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఓపక్క పోలీసుల విచారణ సాగుతుండగానే సైబర్‌ నేరగాడు మరింత బరితెగించాడు.

ఏకంగా 17 ఐడీలను క్రియేట్‌ చేసి వివిధ వర్గాలకు చెందిన దేవుళ్ళను కించపరుస్తూ పోస్టులు పెట్టాడు. అందులో ఓ ఐడీ నుంచి ‘ఒక ఐడీని బ్లాక్‌ చేయిస్తే పది క్రియేట్‌ చేస్తా’ అంటూ సవాల్‌ కూడా విసిరాడు. సదరు సైబర్‌ నేరగాడు బెంగళూరు కేంద్రంగా వీటిని పోస్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత సున్నితమైన ఈ విషయంలో  సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తక్షణం స్పందించాలని, వీలైనంత త్వరలో సైబర్‌ నేరగాడు వినియోగిస్తున్న ఐడీలన్నింటినీ బ్లాక్‌ చేయించడంతో పాటు నిందితుడిని అరెస్టు చేయాలని ఫిర్యాదుదారుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement