ఏఈవో పోస్టుల భర్తీ ప్రక్రియ షురూ
మొత్తం 1,000 కొత్త పోస్టులు, 506 ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, ఉద్యానశాఖల్లో కొత్తగా 1000 పోస్టులు, ఖాళీగా ఉన్న 506 మండల స్థాయి అధికారుల పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలైంది. వీటి భర్తీకి గత నెల హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 4 వారాల తర్వాత భర్తీ ప్రక్రియ మొదలు పెట్టవచ్చన్న కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నెల 14 తర్వాత జిల్లాల వారీగా నియమకాలు చేపట్టనున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన వారితో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. జిల్లాల వారీగా పోస్టింగులను కూడా టీఎస్‌పీఎస్సీనే జారీ చేస్తుంది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిశాక అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వాల్సిందిగా వ్యవసాయశాఖ టీఎస్‌పీఎస్సీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. మరోవైపు కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రెండు పిటిషన్లు దాఖలైనట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అరుుతే తాము కేవియట్ దాఖలు చేసినందున సమస్య ఉండకపోవచ్చని, కానీ ఏం జరుగుతుందో వేచి చూడాలని అంటున్నారు.
అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాకు..
కొత్తగా మంజూరైన వెరుు్య ఏఈవో పోస్టులను పాత 10 జిల్లాల ప్రాతిపదికగా కేటారుుంచారు. అందులో అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాకు 214, వరంగల్ జిల్లాకు 149, ఆదిలాబాద్ జిల్లాకు 145 పోస్టులను కేటారుుంచారు. వీటిని టీఎస్‌పీఎస్సీ ద్వారా నియమిస్తారు. మొత్తంగా ఖాళీ పోస్టులతో కలుపుకొని 1311 ఏఈవో, 120 ఏవో పోస్టులను వ్యవసాయశాఖ పరిధిలో భర్తీ చేస్తారు. ఉద్యానశాఖలో 75 ఉద్యానశాఖ అధికారి (హెచ్‌వో) పోస్టులను భర్తీ చేస్తారు. 6,500 ఎకరాలకు ఒక ఏఈవో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే దాదాపు ఒకట్రెండు గ్రామాలకు ఒక ఏఈవో ఉండే అవకాశముంది. వారు పొలాలను, పంటలను పరిశీలించి.. ఎటువంటి పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు వేయాలో రైతులకు ప్రిస్కిప్షన్ రాసిస్తారు.
న్యాయ నిపుణుల సలహా కూడా..
పాత జిల్లాల వారీగా పోస్టులను కేటారుుంచ డం, వాటికి టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహించడం తెలిసిందే. ఇవన్నీ కూడా జిల్లా పోస్టులే. అరుుతే ఆ తర్వాత 21 కొత్త జిల్లాలు ఏర్పడడంతో.. పాత జిల్లాల ప్రకారం కేటారుుంచిన జిల్లా పోస్టులను కొత్త జిల్లాల ప్రకారం ఎలా కేటారుుస్తారన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఎటువంటి సాంకేతిక సమస్య తలెత్తకుండా న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ ప్రకారమే పోస్టుల కేటారుుంపులు ఉంటాయని చెబుతున్నా.. కొత్త జిల్లాలకు వాటిని ఎలా సర్దాలన్న అంశంపై వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది.