నోట్లరద్దు: చిల్లరపేరిట బీరుపై బాదుడు! | excise department decision on liquor | Sakshi
Sakshi News home page

నోట్లరద్దు: చిల్లరపేరిట బీరుపై బాదుడు!

Published Sat, Dec 3 2016 6:51 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

నోట్లరద్దు: చిల్లరపేరిట బీరుపై బాదుడు!

నోట్లరద్దు: చిల్లరపేరిట బీరుపై బాదుడు!

హైదరాబాద్‌: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్య తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రూ. 5తో చిల్లర సమస్య తలెత్తకుండా ఒక చిత్రమైన నిర్ణయం తీసుకుంది. లోక్లాస్‌ మద్యం రేట్లను ఏకంగా రూ. 5 పెంచి చిల్లర సమస్య రాకుండా లెక్క సమం చేసింది.

రూ. 75 నుంచి రూ. 215 వరకు ఉన్న మద్యం బాటిళ్ల ఖరీదును రూ. 5 చొప్పున ఎక్సైజ్‌శాఖ పెంచేసింది. అదేవిధంగా బీరు సీసాల ధరల్లోనూ ఇలాగే సవరణ చేసింది. దీంతో రూ. 105 ఉన్న బీరును ఇకపై రూ. 110కి అమ్మనున్నారు. చిల్లర సమస్య తీర్చాలంటూ మద్యంషాపుల అసోసియేషన్‌ కోరడంతో ఎక్సైజ్‌శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం బాటిళ్ల ధరలు రూ. 5తో ఉండటం వల్ల చిల్లర సమస్య వస్తున్నదంటూ మద్యందుకాణాలు మొరపెట్టుకోవడంతో ఇలా ధరలను పెంచింది. దీనివల్ల ఎక్సైజ్‌శాఖకు అదనంగా రూ. 50 కోట్ల ఆదాయం చేకూరనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement