నోట్లరద్దు: చిల్లరపేరిట బీరుపై బాదుడు!
హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్య తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రూ. 5తో చిల్లర సమస్య తలెత్తకుండా ఒక చిత్రమైన నిర్ణయం తీసుకుంది. లోక్లాస్ మద్యం రేట్లను ఏకంగా రూ. 5 పెంచి చిల్లర సమస్య రాకుండా లెక్క సమం చేసింది.
రూ. 75 నుంచి రూ. 215 వరకు ఉన్న మద్యం బాటిళ్ల ఖరీదును రూ. 5 చొప్పున ఎక్సైజ్‌శాఖ పెంచేసింది. అదేవిధంగా బీరు సీసాల ధరల్లోనూ ఇలాగే సవరణ చేసింది. దీంతో రూ. 105 ఉన్న బీరును ఇకపై రూ. 110కి అమ్మనున్నారు. చిల్లర సమస్య తీర్చాలంటూ మద్యంషాపుల అసోసియేషన్ కోరడంతో ఎక్సైజ్‌శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం బాటిళ్ల ధరలు రూ. 5తో ఉండటం వల్ల చిల్లర సమస్య వస్తున్నదంటూ మద్యందుకాణాలు మొరపెట్టుకోవడంతో ఇలా ధరలను పెంచింది. దీనివల్ల ఎక్సైజ్‌శాఖకు అదనంగా రూ. 50 కోట్ల ఆదాయం చేకూరనుంది.