విదేశీ విద్యకు సాయం ఇలా..
బీసీ ఓవర్సీస్ పథకం మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్: జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే బీసీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం కింద 2016-17లో ముందుగా 300 మంది విద్యార్థులకు రూ.20 లక్షల సాయమందించనున్నారు. ఈ మేరకు సోమవారం బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎఫ్‌ఏసీ) సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
ఇవీ మార్గదర్శకాలు..
గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షన్నర లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు కుటుంబ వార్షికాదాయం.
ఉద్యోగులు అయిన వారు తాము పనిచేస్తున్న సంస్థ నుంచి తప్పనిసరిగా వేతన సర్టిఫికెట్ జతపరచాలి.
తాజా టాక్స్ అసెస్‌మెంట్‌తో పాటు, తాజా వేతన సర్టిఫికెట్‌ను కూడా జతచేయాలి.
ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మీ-సేవా నుంచి పొందాలి.
పత్రికా ప్రకటన వెలువడే జూలై 1 నాటికి 30 ఏళ్ల వయసు మించరాదు.
విద్యార్హతలు..
ఇంజనీరింగ్/ మేనేజ్‌మెంట్/ ప్యూర్‌సెన్సైస్/ అగ్రికల్చర్ సెన్సైస్/ మెడిసిన్, నర్సింగ్ / సోషల్ సెన్సైస్/ హ్యుమానిటీస్ వంటి ఫౌండేషన్ డిగ్రీలో 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌ను సాధించాలి.
యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాల్లో చదవొచ్చు.
టోఫెల్/ఐఈఎల్‌టీఎస్ అండ్ జీఆర్‌ఈ/జీమాట్ అర్హత కలిగి ఉండాలి
అక్రిడెటెడ్ విదేశీ విద్యాలయంలో ప్రవేశం పొంది ఉండాలి
చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి
అక్రిడెటెడ్ వర్సిటీ/విద్యాసంస్థలో సొం తంగా ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకోగలగాలి
ఎంపికైనట్లు వర్తమానం అందాక సంబంధిత యూనివర్సిటీలో ఏడాదిలోగా చేరాలి.
ఏ దేశంలో చదవదలుచుకున్నారో ఆ దేశ వీసాను విద్యార్థే పొందాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు అవసరమైన అన్ని పత్రాలను జతచేయాలి
ఎంపిక పద్ధతి..
వార్తాపత్రికల్లో ప్రకటనల ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
ఏటా ఆగస్టు/సెప్టెంబర్, జనవరి/ఫిబ్రవరిలలో ఈ-పాస్ పోర్టల్‌లో నోటిఫికేషన్
ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30లోగా, జనవరి 28 నుంచి ఫిబ్రవరి 29లోగా http://www.telanganaepass.cgg. gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
30 శాతం మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేస్తారు.
బీసీ-ఏ 29 శాతం, బీసీ-బీ 42 శాతం, బీసీ-డీ 29 శాతం (33 శాతం మహిళలు, 3 శాతం వికలాంగ విద్యార్థులు కలుపుకొని) కేటాయిస్తారు.
(బీసీ-సీ, బీసీ-ఈలతో పాటు, బీసీ-ఏ లోని మెహతర్, సిక్లిగర్/సైకల్‌గర్, బీసీ-బీలోని దూదేకుల, లడ్డాఫ్, పింజరి లేదా నూర్‌బాషా.. వీరంతా కూడా మైనారిటీ సంక్షేమశాఖ పరిధిలోకి వస్తారు-అందువల్ల వీరిని మినహాయించారు