హైదరాబాద్: నగరంలో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ఓ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కార్పొరేట్ కంపెనీలకు గోదాములు, సెల్ టవర్ల కోసం భవనాలను లీజ్‌కు ఇస్తామంటూ నగరానికి చెందిన ఈ ముఠా సభ్యులు ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
ఈ ముఠా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 150 మంది నుంచి రూ.20కోట్లకుపైగా వసూలు చేసినట్లు వివరించారు. ముఠాలో నలుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి ఒక రివాల్వర్, 6 బుల్లెట్లు, రూ.60 వేల నగదు, సెల్‌ఫోన్లు, రబ్బర్ స్టాంప్స్, 4 లాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మిగతావారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.
నలుగురు ఆన్‌లైన్ మోసగాళ్ల అరెస్ట్
Published Mon, May 29 2017 12:26 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement