విద్యుత్ స్తంభం పై మరమ్మత్తులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన సికింద్రాబాద్ మెట్టుగూడలో గురువారం వెలుగుచూసింది. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన రాజు(28) గత పది సంవత్సరాల నుంచి జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు.
ఈక్రమంలో ఈ రోజు స్తంభం పై మరమ్మత్తులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా జరగడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చెరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.