- మహాపడిపూజ కోసం మండపం వేస్తుండగా ఘటన
- విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికుల ఆగ్రహం
హైదరాబాద్: అయ్యప్పస్వామి మహాప డిపూజ కోసం మండపం వేస్తుండగా ఇనుప రాడ్లు హైటెన్షన్ వైర్లకు తగిలి విద్యుత్ సరఫరా కావడంతో ఇరువురు అయ్యప్ప స్వాములు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ మెట్టుగూడ గోవిందపురానికి చెందిన రాసూరి కల్యాణ్ అలియాస్ కన్నయ్య (18) అదే ప్రాంతానికి చెందిన టెంట్‌హౌస్ వర్కర్ డి.శివకుమార్ (20) అయ్యప్ప మాల వేశారు.శివకుమార్ బంధువులు బుధవారం అయ్యప్ప మహాపడిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మృతులు కల్యాణ్, శివకుమార్, మరికొంత మంది స్వాములు మంగళవారం రాత్రి మండపం వేస్తున్నారు. ఈ క్రమంలో కల్యాణ్, శివకు మార్‌లు పట్టుకున్న ఇనుపరాడ్లు పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు.
వెంటనే ఇద్దరినీ గాంధీ ఆస్పత్రికి తరలించగా, అప్ప టికే వారు మృతిచెందినట్లు వైద్యులు ధృవీక రించారు. స్థానిక టీఆర్‌ఎస్ నాయకురాలైన సునీత కుమారుడు కల్యాణ్ కాగా, శివకుమార్ తండ్రి రాజు కొంతకాలం క్రితం మరణించాడు. కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రెండు నిండు ప్రాణాలు గాలిలో కలసిపోయాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల క్రితం కురిసిన చెట్టు పడి హైటెన్షన్ వైర్లు కిందికి వేలాడుతున్నాయని, పలుమార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్‌శాఖ అధికారులు స్పందిం చలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుదాఘాతంతో ఇద్దరు స్వాముల మృతి
Published Wed, Dec 21 2016 3:50 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement