రాజ్ భవన్ లో ప్రజాదర్బార్
Published Sun, Oct 30 2016 1:25 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
హైదరాబాద్: దీపావళి సందర్భంగా ఆదివారం రాజ్ భవన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా దర్బార్‌లో భాగంగా గవర్నర్ సాధారణ ప్రజలను కలిశారు. తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఏపీ మండలి చైర్మన్ చక్రపాణితో పాటు పలువురు అధికారులు గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఇద్దరు సీఎం లు కలిసి చక్కదిద్దుకుంటారన్నారు. ప్రజల సంతోషం కోసం ఏపీ, తెలంగాణ పనిచేస్తాయనే నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు.
Advertisement
Advertisement