హైదరాబాద్ : గతంలో ఇంటర్వ్యూలు చేసిన అభ్యర్థులకే ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గ్రూప్ -1 అభ్యర్థులు డిమాండ్ చేశారు. గురువారం నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద గ్రూప్ - 1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మళ్లీ మెయిన్స్ నిర్వహించొద్దంటూ వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే గ్రూప్ 1 అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అగ్రహించిన గ్రూప్ 1 అభ్యర్థులు రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.