
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని అంబేడ్కర్ నగర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న పేదల స్థలాల్లో వ్యాపార అవసరాలకు నిర్దేశించినవి ఉన్నాయో లేవో చెప్పాలని తెలంగాణ సర్కార్‌ను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నిర్మించే 620 ఫ్లాట్లలో 280 ఫ్లాట్లను ఎంపిక చేసిన వారికి ఉచితంగా కేటాయిస్తే మిగిలిన 340 ఫ్లాట్ల మాటేంటో చెప్పాలంది. పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్‌ను సింగిల్ జడ్జి వద్ద దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావుల ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తమ భూమిలో డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లు ప్రభుత్వం నిర్మిస్తోందంటూ జగన్నాథ్ సింగ్, మరో 8 మంది రిట్ దాఖలు చేశారు. దీనిపై యథాతథస్థితి ఉత్తర్వుల్ని సింగిల్ జడ్జి ఎత్తేయడంతో నిర్మాణానికి ఇబ్బందులు తొలిగాయి. ఈ ఉత్తర్వులపై పిటిషనర్ అప్పీల్ దాఖలు చేయగా కోర్టు విచారించింది. డబుల్‌బెడ్రూం ఇళ్ల కోసం 280 మంది ఇష్టపూర్వకంగా స్థలాలిచ్చారని, అక్కడి 340 ఫ్లాట్లు విక్రయించి ప్రభుత్వం వ్యాపారం చేయబోతోం దని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలున్న ప్రాంతంలో 2 పడకల ఫ్లాట్ల నిర్మాణానికి స్థలమివ్వడానికి ఇష్టపడే వారు ముందుకొచ్చారని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment