నగరంలోని ఉప్పల్లో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక ఆటో స్టాండ్ స్థలంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) యత్నిస్తుంది.
హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్లో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక ఆటో స్టాండ్ స్థలంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) యత్నిస్తుంది. ఆ ప్రయత్నాన్ని ఆటో యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ స్థలం ఆటో స్టాండ్గా ఉందని...ఇప్పుడు ఈ ప్రదేశంలో రైతు బజార్ ఏర్పాటు చేయడం ఏమిటని ఆటో డ్రైవర్లు... జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఆటోయూనియన్ నాయకుల వాదనను జీహెచ్ఎంసీ అధికారులు తొసిపుచ్చి... రైతు బజార్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం తెలిసిన ఆటో యూనియన్ నాయకులు రాత్రికి రాత్రే ఆటో స్టాండ్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.