చారిత్రాత్మక కట్టడాలు/ప్రాంతాల పరిరక్షణ బాధ్యతల నుంచి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)ను రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది.
సాక్షి, హైదరాబాద్: చారిత్రాత్మక కట్టడాలు/ప్రాంతాల పరిరక్షణ బాధ్యతల నుంచి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)ను రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి గోపాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఏపీ అర్బన్ డవలప్‌మెంట్ ఆథారిటీ చట్టంలో చారిత్రాత్మక ప్రాంతాల సంరక్షణకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. అయినప్పటికీ 1995లో అప్పటి ప్రభుత్వం జీవో 542 ద్వారా ఈ బాధ్యతలను హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ(హుడా)కు అప్పగించింది. తదనంతరం హెచ్‌ఎండీఏ చట్టంలో 13వ నిబంధనగా చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణ చేరిపోయింది.
అయితే, 13వ నిబంధన.. ఏపీ అర్బన్ డవలప్‌మెంట్ ఆథారిటీ చట్టంతో సంబంధం లేదని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వొకేట్ జనరల్ తేల్చి చెప్పడంతో తాజాగా చట్టం నుంచి ఈ నిబంధనను ప్రభుత్వం తొలగించింది.