తన ఆటోలో ప్రయాణికురాలు మరిచిపోయిన నగలను తిరిగి అందజేసి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. శుక్రవారం ఉదయం పుష్ప అనే మహిళ తన కుమారుడితో కలిసి గోల్నాక ఆటో ఎక్కి ఉప్పల్ రింగ్‌రోడ్డులోకి దిగి వెళ్లిపోయింది. అయితే, డ్రైవర్ ఎం.ఇ.బాబా ఆటోలో పుష్ప బ్యాగ్ వదిలివెళ్లిన విషయం గమనించి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు అప్పగించారు. అందులో పుష్పకు చెందిన రెండు తులాల బంగారు గొలుసు ఉంది. బ్యాగులో దొరికిన ఆధారాలతో పుష్పకు ఫోన్ చేసి స్టేషన్‌కు పిలిపించారు. పోలీసుల సమక్షంలో ఆటో డ్రైవర్ బాబా నగ లు సహా సొత్తును పుష్పకు తిరిగి అప్పగించాడు. నిజాయితీగా వ్యవహరించిన బాబాను అందరూ అభినందించారు.
ఆటో డ్రైవర్ నిజాయితీ
Published Fri, Oct 7 2016 2:00 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement