మినీ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్ల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ టీచర్లకు వేతనాలు పెంచినట్లే తమకు కూడా పెంచాలని రాష్ట్ర మినీ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.10,500, హెల్పర్లకు రూ.8 వేలకు పెంచాలని కోరింది. రాష్ట్రంలో 4 వేల మంది మినీ అంగన్‌వాడీ వర్కర్లు టీచర్‌గా, హెల్పర్‌గా రెండు రకాల విధులు నిర్వహిస్తున్నారని, అయినా వారిని హెల్పర్లతో సమానంగా చూడడం వల్ల నష్టం జరుగుతోందని తెలిపింది.
ఈ మేరకు మంగళవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డైరెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ధర్నాలో సంఘం నేతలు పి.జయలక్ష్మి, ఆర్.వాణి, కవిత తదితరులు పాల్గొన్నారు.
మా వేతనాలూ పెంచండి
Published Tue, Mar 7 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
Advertisement