సాక్షి, హైదరాబాద్: దాదాపు 10 లక్షల మంది రాసిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు వర్గాలు గురువారం వెల్లడించాయి. ఫలితాల వెల్లడికి సంబంధించిన పనులు చివరి దశకు చేరుకున్నాయని, అయితే ఫలితాల వెల్లడి సమయం శుక్రవారం ఖరారు అవుతుందని పేర్కొన్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు.