సాక్షి,సిటీబ్యూరో: సంక్రాంతి పర్వదినం సందర్భంగా భాగ్య నగరవాసులకు మధురానుభూతిని పంచాలని భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వం అధికారులు ఊహించని రీతిలో జనం భారీగా తరలివచ్చారు. పరేడ్ మైదానం మూడురోజుల పాటు మిఠాయిలతో ఘుమఘుమలాడింది. వెరసి సిటీజనులు ఎంతో ఎంజాయ్ చేశారు. అధికారులు ఊహించిన దానికంటే ఏడు రెట్లు ఎక్కువగా జనం తరలిరావటం విశేషం. దేశంలో ఎక్కడ జరగని విధంగా తొలిసారిగా అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది.
నోరూరించిన బెంగాలీ రసగుల్ల..
స్వీట్ ఫెస్టివల్‌లో తొలిరోజు 800 రకాలు ప్రదర్శించా రు. గంటన్నరలోనే 70 శాతం అమ్ముడు పోయా యి. రెండోరోజు 1000 రకాలు ఉంచారు. రాత్రి 9 గంటలకే అన్ని అమ్ముడు పోయాయి. చివరిరోజైన 15వ తేదీన 1200 రకాలు స్వీట్లు ఉంచారు. సాయంత్రం జనం ఒక్కసారిగా ఎగబడడంతో అవి కూడా పూర్తిగా అమ్ముడు పోయాయి. ప్రధానంగా జాతీయ స్థాయి మిఠాయిల్లో కొంకణి స్వీట్లు, బీహార్ స్వీట్లు బాగా అమ్ముడు పోయా యి. బీహార్‌కి తెలంగాణ స్వీట్లకు దగ్గరి పోలిక ఉండటంతో నగరవాసులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ప్రదర్శనలో ఉంచిన 74 రకాల పాయసాలు క్షణాల్లో అమ్ముపోయాయి. బెంగాలీ రసగుల్లలకు భలే గిరాకీ ఏర్పడింది. ఇక అంతర్జాతీయంగా టర్కీ, కొరియా దేశాల స్వీట్లు అందరి మనస్సులను దొ చుకొన్నాయి. బూడిద గు మ్మడితో చేసిన స్వీట్ ప్ర జల ఫెవరేట్ కావటం విశేషం. దక్కన్ స్వీట్ల కోసం జనం క్యూ కట్టారు. హైదరాబాద్‌లో ఉ న్న బీహరీ, తమిళనాడు, మల యాళం, కర్ణాటక, కొంకణి సమాజా లు ఫెస్టివల్ విజయవంతంలో కీలకభూమిక పోషించాయి. 15వ తేదీ రాత్రి అంతర్జాతీయ పతంగుల పండగలో పాల్గొన్న కైట్ ప్లేయర్స్‌కి ప్లాజా హోట ల్‌లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు.
ఊహించని రీతిలో సందర్శకుల రాక..
13 నుంచి 15 వరకు జరిగే స్పీట్ ఫెస్టివల్‌కు మూడు రోజులకు కలిపి లక్ష మంది జనం వస్తారని టూరిజం – సాంస్కృతిక శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. పోలీసు అధికారులు మందస్తుగా అడిగితే అదే సమాచారం అందించారు. కానీ పరిస్థితి మొదటి రోజే మారిపోయింది. ఊహించిరీతిలో తొలిరోజు ఇటు స్వీట్– కైట్ ఫెస్టివల్‌కు 1.50 లక్షల మంది హాజరయ్యారు. రెండోరోజైన 14వ తేదీన ఏకంగా 3 లక్షల మంది హాజరయ్యారు. దీంతో సాయంత్రంలోగా పరేడ్ మైదానం జనస ం ద్రంగా మారింది. మూడోరోజు 2.50 లక్షల మంది హాజరవటంతో అధికారులు సైతం
Comments
Please login to add a commentAdd a comment