పీకలదాక మద్యం తాగిన ఓ యువకుడు జూనియర్ ఆర్టిస్ట్‌పై లైంగికదాడికి యత్నించాడు. పోలీసులు ‘నిర్భయ’చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: పీకలదాక మద్యం తాగిన ఓ యువకుడు జూనియర్ ఆర్టిస్ట్‌పై లైంగికదాడికి యత్నించాడు. పోలీసులు ‘నిర్భయ’చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ శంకర్‌రెడ్డి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన సురేష్‌బాబు (26) ఇందిరానగర్‌లో ఉంటూ సినిమాల్లో సెట్టింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి పదిన్నర గంటలకు పీకల దాకా మద్యం తాగిన ఇతను రహ్మత్‌నగర్‌లో ఉండే జూనియర్ ఆర్టిస్ట్ (22) ఇంటికి వెళ్లి తలుపుతట్టాడు.
ఆమె తలుపు తీయగానే ఉదయాన్నే సినిమా షూటింగ్ ఉందని, సిద్ధంగా ఉండమని చెప్పాడు. గతంలో తనను షూటింగ్‌కు తీసుకెళ్లి ఇంతవరకు పారితోషికం ఇవ్వలేదని ఈసారి వచ్చేది లేదని ఆమె చెప్పింది. దీంతో ఆగ్రహించిన సురేష్ ఆమెను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన సురేష్ ఆమెను గట్టిగా పట్టుకొని మెడ కొరకడంతో పాటు లైంగికదాడికి యత్నించారు.
షాక్‌కు గురైన బాధితురాలు మెడ నుంచి రక్తం కారుతుండగా గట్టిగా కేకలు పెడుతూ పరుగులు తీసింది. అక్కడకు వచ్చిన మరో మహిళతోనూ సురేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో స్థానికులు సురేష్‌ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై నిర్భయ చట్టం (సెక్షన్ 354) కింద కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్‌చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.