‘కళ్యాణలక్ష్మి’ పథకం కింద ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ సాయం విషయంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఆడపిల్లల పెళ్లికి ‘కళ్యాణలక్ష్మి’ పథకం కింద ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ సాయం విషయంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఇప్పటి వరకు పెళ్లికూతురు తల్లి పేరు మీద రూ. 51వేల కళ్యాణల క్ష్మి చెక్‌ను ఇచ్చేవారు. అయితే పెళ్లికూతురు తల్లి జీవించి లేని పక్షంలో తండ్రి పేరు మీద చెక్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి బెన్హర్ మహేష్‌దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు.