- ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు
పొన్నూరు(గుంటూరు జిల్లా)
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని, రాష్ట్రానికి ప్రధాన శత్రువు ఆయనేనని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు ఆరోపించారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నారని, దళితుల స్కూళ్లు, హాస్టళ్లు మూసేస్తున్నారని, వారి భూములను కూడా ఆక్రమిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని, నవ్యాంధ్ర పార్టీకి ఓట్లు వేసే విధంగా ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. సంపూర్ణ మద్యపానం కోసం పోరాడాలని, భూమిలేని ప్రతి స్త్రీకి రెండు ఎకరాల భూమి కోసం పోరాడాలని తీర్మానించినట్లు చెప్పారు. ప్రత్యేకహోదా సాధించే వరకు పోరాటం చేయాలని, దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవన వ్యవస్థను నిర్మించాలని తీర్మానించినట్లు తెలిపారు. అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టాలని పద్మారావు డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి ప్రధాన శత్రువు చంద్రబాబే
Published Mon, Sep 12 2016 8:40 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement