తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఇటీవలే నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల ప్రాథమిక కీని బుధవారం విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఇటీవలే నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల ప్రాథమిక కీని బుధవారం విడుదల చేసింది. ఏ, బీ, సీ, డీ సిరీస్‌లకు సంబంధించిన ప్రశ్నపత్రాల బుక్‌లెట్స్, ‘కీ’లను తన అధికారి వెబ్‌సైట్ (www.tslprb.in)లో అందుబాటులో ఉంచింది. అభ్యంతరాలు ఉన్న వారు శనివారం సాయంత్రం 5 గంటల్లోపు (keyobjectionspc@tslprb.in)కుఈ మెయిల్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని బోర్డు కోరింది.