హైదరాబాద్: హైకోర్టు, ఉద్యోగుల విభజనపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వంపై టి.జేఏసీ ఛైర్మన్ కోదండరాం మండిపడ్డారు. గురువారం హైదరాబాద్లో కోదండరాం మాట్లాడుతూ... విభజన జరిగి ఏడాది దాటినా రాష్ట్ర పరిస్థితులను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరో ఉద్యమం చేస్తామని కోదండరాం స్పష్టం చేశారు. అందుకోసం త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. విభజన సమస్యలపై మంత్రిత్వశాఖను ఏర్పటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.