గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాలను కూడా విజయవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్: గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాలను కూడా విజయవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా పుష్కరాలకు 825 కోట్లు రూపాయల ఖర్చు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది.
అయితే కృష్ణా పుష్కరాల ఖర్చును తెలంగాణ బడ్జెట్‌లో అంతర్భాగం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. కృష్నా పుష్కరాల సందర్భంగా స్నానఘట్టాల నిర్మాణం, రహదారులు, మంచినీటి సౌకర్యాల ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.