క్యా బాత్ హై
రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను కాదు..వాళ్ల నాయకుడు చంద్రబాబునే ఉరికిచ్చినం. 60 ఏండ్ల దారిద్య్రం 18 నెలల్లో పోతదా..హైదరాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు.
- రాజేంద్రనగర్ రోడ్‌షోలో మంత్రి కేటీఆర్
వుుస్లిం మైనార్టీల ఓట్లు రాబట్టేందుకే ఎంఐఎం బీఫ్ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. టీఆర్‌ఎస్‌తో కలిసి పాతబస్తీలో అభివృద్ధిని అడ్డుకుంటోంది. ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి.
- పాతబస్తీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
నగరంలో సీమాంధ్రులకు నష్టం కలిగించే పనులు మానుకోవాలి. కేసీఆర్, కేటీఆర్ పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. గ్రేటర్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లిస్తారు.
- మాదాపూర్ రోడ్ షోలో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి