హైదరాబాద్ నగరంలోని నేరేడ్‌మెట్ పరిధి కాకతీయనగర్‌లో దారుణం చోటుచేసుకుంది.
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలోని నేరేడ్‌మెట్ పరిధి కాకతీయనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య పెరికోళ్ల శ్రీకళ(27)ను భర్త శ్రీకాంత్ సోమవారం ఉదయం గొంతునులిమి చంపాడు. హత్యానంతరం సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంతకు ముందు నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా ? ఎవరిది తప్పు అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.