రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితులకు మూడెకరాల భూపంపిణీ బూటకమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. భూపంపిణీ అంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడమేగానీ గోరంతైనా పంపిణీ జరగలేదన్నారు. దళితుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని నడిరోడ్డుపై దోషిగా నిలబెడతామని, ఇందుకోసం ప్రజాపోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 5, 6ల్లో గ్రామస్థాయి లో, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.